ఈ69న్యూస్ నకిరేకల్:జూన్ 22,23 తేదీల్లో కట్టంగూరు మండల కేంద్రంలో KVPS జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు.రాష్ట్ర నాయకులు బోధన చేస్తారని,200 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.సమాజంలో కుల వివక్షత పెరిగిందని,బలహీనులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల మద్దతుతో ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు