
కడియం శ్రీహరి జోలికి వస్తే ఊరుకోం-గ్రంథాలయ చైర్మన్ రాంబాబు
ఈ69న్యూస్:-జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాజయ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.కడియం శ్రీహరి పై తన కుటుంబం పై తప్పుడు ఆరోపణలు,అనుచిత వ్యాఖ్యలు చేస్తే Congress కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.కడియం శ్రీహరి కెసిఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఒకవేళ తీసుకున్నట్లు ఐతే స్వయంగా కేసిఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు.నిజానికి కేసిఆర్ కుటుంబమే లక్షల కోట్ల డబ్బులు తిన్నారని ఆరోపించారు.దేవునూరు భూములు కబ్జా చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.ఈ విషయమై నిరూపించాలని కడియం శ్రీహరి వారికి సవాలు విసిరినా స్వీకరించలేదని మండి పడ్డారు.మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..కడియం శ్రీహరి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందని గుర్తు చేశారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి తన నియోజక వర్గం వదిలి స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి రావడాన్ని తప్పుపడుతూ వారిపై మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.