కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సరస్వతి సేవలు మరువలేనివి
వైద్య రంగలో సరస్వతి సేవలు మరువలేనివని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం ఐనవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరతి సరస్వతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పదవీ విరమణ పొందుతున్న సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సరస్వతికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ తో పాటు యునాని డాక్టర్ సతీష్ పల్లె దావకాన డాక్టర్లు నవీన్, సరిత, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశాలు, సిబ్బంది సరస్వతిని శాలువల తో ఘనంగా సన్మానించారు.సరస్వతి 1985 లో ఏఎన్ఎం గా గూడూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ మాడగూడెంలో ఉద్యోగంలో చేరి ఎంతో సేవాగుణంతో ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు.2022 లో పబ్లిక్ హెల్త్ నర్సుగా ఐనవోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేశారు.. 2024, నుండి 2026 ఫిబ్రవరి 28 సరస్వతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ సమయపాలనలో ఏఎన్ఎంలు ఆశాలు సిబ్బందితో కలిసి ప్రజలకు ఎంతో సేవలందించారన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు, ఫార్మసిస్ట్ స్వరూప, ఎల్ టి శ్రీధర్, పైండ్ల నవీన్, మరియు 108 సిబ్బంది,మరియు ఆరోగ్య సిబ్బంది కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు.