
ఈ 69న్యూస్ న్యూస్ కరీంనగర్, మార్చి 13:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కవితక్క పేరు మీద ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు.బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు రమేష్ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. జిల్లా సీనియర్ నాయకుడు రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో భారీ కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.అలాగే జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అక్కం శివరాణి ఆధ్వర్యంలో బిట్ వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. జిల్లా సీనియర్ నాయకుడు బసవేణి రాజేందర్ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో కూడా పండ్లు పంపిణీ చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు గుండేటి తిరుపతి ఆధ్వర్యంలో స్పందన వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కవితక్క నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. ప్రజల మధ్యలో ఇలాంటి జన్మదిన వేడుకలు జరపడం ఆనందకరమని అన్నారు.వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగడంలో కవితక్క చేసిన పోరాటం ముఖ్య పాత్ర పోషించిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షం, పాలకపక్షం రెండూ ఒకేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కవితక్క మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి పేదలకు సేవలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు చంటి శ్రీనివాస్, గాలిపల్లి రత్నాకర్ చారి, జంగ అపర్ణ, పిన్నింటి సంగీత రెడ్డి, గర్శకుర్తి విద్యాసాగర్, ఎండీ సల్మా, పోన్నం శిరిష, అంజలి, పుసాల పవన్, లంక మనోజ్, మహమ్మద్ హుస్సేన్, ఎండీ యాకుబ్, రంగరవేణి ఆకాశ్, హుస్నాబాద్ రాజ్‌కుమార్, నవ్య తదితరులు పాల్గొన్నారు.