కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు
టేకుమట్ల మండల రామకిష్టాపూర్ (టి) గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో వీరు కండువా కప్పుకుని బీఆర్ఎస్లో చేరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కట్ల సదయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు బోండ్ల మహేష్,బోలెడ్ల రాజేందర్ రెడ్డి,అచ్చే రవి, ప్రధాన కార్యదర్శి అటుకాల సురేష్,ప్రచార కార్యదర్శి కనుమల్ల కరుణాకర్, కోశాధికారి మడిపోజు సదానందం తో పాటు సలుపాల కుమార్, రమేష్, పొలాల రాజిరెడ్డి, కొట్టే సురేందర్, అచ్చే రమేష్, సాద నరేష్, నరెడ్ల నితిన్, కౌడగాని మల్లయ్య, సాద రాజేష్, బందేల రమేష్, అచ్చే సంతోష్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, ప్రజాభివృద్ధి కార్యక్రమాలకు, గ్రామాల పురోగతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్తగా చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సట్ల రవి, మాజీ ఎంపీపీలు రెడ్డి మల్లారెడ్డి, స్నేహలత నరేష్, మాజీ ఎంపీటీసీ ఆది రఘు,గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్,సీనియర్ నాయకులు నిరంజన్, రాజు తదితరులు పాల్గొన్నారు.