కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కట్టుబడి పని చేయాలి గండ్ర
రేగొండ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం విజయ సుధాకర్ ని భారీ మెజారిటీతో విజయం సాధింపజేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు.గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలోనే నిజమైన అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుంది అని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేగొండ గ్రామం సహా భూపాలపల్లి నియోజకవర్గంలోని అనేక గ్రామాలు అభివృద్ధి లోపంతో నిలిచిపోయాయని విమర్శించారు.
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల వ్యవధిలో గ్రామాలు మారుముఖం పట్టేలా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.గ్రామంలోని అన్ని వర్గాల నాయకులు, యువత, మహిళలు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు… ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.