కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి:ఎమ్మెల్యే మట్టా"
ఆదివారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోని 8,13 వార్డులైన ఎన్టీఆర్ కాలనీ,జవహర్ నగర్ లలో శీలం వెంకటనారాయణ,వంగల పుల్లయ్య లకు చెందిన ఇందిరమ్మ ఇళ్లకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశం చేయించారు.రాగమయికు లబ్ధిదారులు పుష్పాలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు.చీర,సారే పెట్టీ,శాలువ కప్పి సత్కరించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.ఆమెతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, చల్లగుళ్ల నరసింహారావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు,మాజీ కౌన్సిలర్లు కమాల్ పాషా,తోట సుజలారాణి,మాజీ సహకార సంఘం అధ్యక్షులు చల్లగుళ్ల కృష్ణయ్య,గ్రాండ్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.