కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించండి
గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(ఆదివారం) భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మరియు రేగొండ మండలాల్లోని జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, వెంకటేశ్వర్లపల్లి, రామన్నగూడెం తండా, జూబ్లీనగర్ గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, రెండు మండలాల కాంగ్రెస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.