కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న చేరికల పర్వం
హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికీ పరకాల లలిత కన్వీన్షన్ హాల్ లో పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధిని పక్కనపెట్టి తమ కుటుంబాల అభివృద్ధికి పరిమితమైపోయిందని విమర్శించారు,తెలంగాణ రాష్ట్ర ఖజానాను టిఆర్ఎస్ పార్టీ ఖాళీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కే గ్యాస్ సిలిండర్,సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను వేగంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు,కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరిన వివరాలు..
బిఆర్ ఎస్ ముఖ్య నాయకులు కొత్తపెల్లి శ్రీనివాస్,శనిగరపు సంపత్ మాజీ వార్డ్ మెంబర్, శనిగరపు రవీందర్, ఈర్ల రవీందర్,బండ బాబురావు, శనిగరపు రవీందర్,బండ రాజమల్లు..
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందేర్ గౌడ్,పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని, మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయినా రవీందర్ యాదవ్,పాడి ప్రతాప్ రెడ్డి,పర్నెం మల్లారెడ్డి,చాడ తిరుపతి రెడ్డి, పర్నెం తిరుపతి రెడ్డి,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు శనిగరపు సాంబయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు సాంబయ్య,నార్లపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి రాజయ్య,మాజీ ఉపసర్పంచ్ కొమురవెల్లి సందానధం,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఒరగంటి సంతోష్,దొరి శ్రీనివాస్,నారపురి సారంగా పాణి, జక్కుల రవి, బండ శ్రీనివాస్,బండ అశోక్, మెరుగు రాజయ్య,అమితా బచ్చన్,శనిగరపు సాంబయ్య, శనిగరపు మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.