ఈ69న్యూస్ డెస్క్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ఒకరు,కేరళ మాజీ ముఖ్యమంత్రి,వామపక్ష ఉద్యమానికి చిరునామా అయిన కామ్రేడ్ వి.ఎస్.అచ్యుతానందన్ వయోభారంతో (వయస్సు 102) సోమవారం కన్నుమూశారు. జోహార్లు జోహార్లు కామ్రేడ్ అచ్యుతానందన్ కు అతి సామాన్య కూలీ కుటుంబంలో జన్మించి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్న అచ్యుతానందన్.అనంతరం భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలలో ముందుండి నడిపారు.కేరళ రాష్ట్ర రాజకీయాల్లో ప్రగతిశీల మార్గాన్ని కలిగించిన గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.2006-2011 మధ్య కాలంలో కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన విద్య,వైద్యం,వ్యవసాయం,శ్రామికుల సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.పార్లమెంటు సభ్యుడిగా కూడా దేశవ్యాప్తంగా తన ప్రత్యామ్నాయ రాజకీయ ధోరణితో గుర్తింపు పొందారు.కార్మిక వర్గం,పీడిత తాడిత జనాల ప్రయోజనాల కోసం జీవితాంతం పోరాడారు.అలాంటి యోధుడి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి,ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. లాల్ సలాం! లాల్ సలాం!