కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.వరంగల్ జిల్లా మొగిలిచర్ల క్రికెట్ మైదానంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో వరంగల్-జనగామ జిల్లాల మధ్య పోరుకు ఎమ్మెల్యే స్వయంగా బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాకా కుటుంబం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుండి,వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని ప్రశంసించారు.గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.డబ్ల్యుడీసీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేసారి మూడు టర్ఫ్ వికెట్లపై అన్ని వసతులతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యుడీసీఏ జిల్లా ఉపాధ్యక్షులు తోట రాము,సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్,కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.వంగాలపల్లి డబ్ల్యుడీసీఏ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో వరంగల్ జట్టు,జనగామ జట్టుపై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మణిదీప్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మొగిలిచర్ల మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో భూపాలపల్లి-మహబూబాబాద్ జట్లు తలపడగా,భూపాలపల్లి జట్టు గెలుపొందింది.కీలక పాత్ర పోషించిన నాగరాజుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ములుగు జిల్లా జాకారం వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో హనుమకొండ-ములుగు జట్లు పోటీపడగా,రోహిత్ రెడ్డి అత్యుత్తమ బ్యాటింగ్‌తో హనుమకొండ జట్టును విజయం దిశగా నడిపించారు.ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించినట్లు డబ్ల్యుడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు