సిపిఐ వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, సి ఐ టి యు సి రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎల్మకంటి శ్రీనివాస్ ఆకస్మిక మృతి సిపిఐ కి తీరనిలోటని జనగామ జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మినేని వెంకట్ రెడ్డి, జఫర్గడ్ పార్టీ మండల కార్యదర్శి ఎండి. యాఖుబ్ పాష, పార్టీ సీనియర్ నాయకులు కూరపాటి చంద్రమౌళి అన్నారు. శుక్రవారం కామ్రేడ్ ఎల్మకంటి శ్రీనివాస్ మృతదేహాన్ని వారు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ ఎల్మకంటి శ్రీనివాస్ నిరంతరం పోరాటాలు , ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తూ సిపిఐ ప్రజానాట్యమండలి నాయకుడిగా, కళాకారునిగా ప్రజలను చైతన్య పరచారని వారు గుర్తు చేశారు.ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.