సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు.
ఆదివారం రోజున సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు అధ్యక్షతన స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగినది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాస్ మాధవి మాట్లాడుతూ కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసం సంపద సృష్టి కర్తలైన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ అమలు కోసం నవంబర్ 21 న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని విమర్శించారు.పోరాడి కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచు కునే విధంగా యజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ కోడుల్లో పొందుపరిచారని విమర్శించారు. కార్మికుల సమ్మె చేసే హక్కును, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ లేబర్ కోడలు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. పర్మనెంట్ అనే విధానం లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అనే విధానం తీసుకొచ్చి పని భద్రత లేకుండా చేశారని విమర్శించారు.
18 వేల వేతనం దాటితే కార్మికుడు పరిధిలోకి రాడు అని కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తుందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
మరోవైపు విద్యుత్ సవరణ 2025 పేరుతో బిల్లు తీసుకొచ్చారని దీనివలన రైతులు సబ్సిడీ పొందే అవకాశాలు లేకుండా, రాష్ట్రాల హక్కులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు.ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విభి జి రామ్ జి పేరుతో మార్పు చేశారని కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 60 శాతానికి పరిమితం చేసి మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలపై రుద్దుతూ ఉపాధి పథకాన్ని క్రమంగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే బిజెపి ఈ నాటక మాడుతుందని విమర్శించారు. భీమా రంగంలో 100% ఎఫ్డిఐ లకు వెసులుబాటు కల్పిస్తూ సబ్కా భీమా సబీ రక్ష అనే పేరుతో భీమా చట్టాల బిల్లు తీసుకొచ్చిందని ఇది ఉద్యోగులకు లబ్ధిదారులకు అత్యంత ప్రమాదకరమైనదని కేవలం బీమా కంపెనీల పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేటివని దేశ ప్రజలకి తీవ్ర నష్టదాయకమని తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అయ్యే న్యూక్లియర్ ను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే న్యూక్లియర్ సేఫ్టీ ఎకౌంటబిలిటీ మరియు సార్వభౌమాధికారం అనే పేరుతో బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ఉద్యోగులు పేద ప్రజలపై ఏకకాలంలో దాడి చేస్తున్నదని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమం నిర్మించడం కోసం ప్రజా సంఘాలు సమయతమవుతున్నాయని అందులో భాగంగా , జనవరి 19 న జరిగే కార్మిక కర్షక ఐక్యత ర్యాలీలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ విధానాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ కోశాధికారి అన్నబోయిన రాజు జిల్లా సహాయ కార్యదర్శి బూడిద ప్రశాంత్ ఉపాధ్యక్షులు రామ్ బస్సు చందర్, పొదల నాగరాజు బైరగోని అంజుమ్ జిల్లా కమిటీ సభ్యులు కట్టగల వెంకటేష్ కుమారస్వామి శివరాత్రి రాజు నాయకులు రామ తార మంగ చీర శ్రీను మునీర్ ఉపేందర్ జ్యోతి సుమతి ,అరుణ తదితరులు పాల్గొన్నారు