వరంగల్ పోచమ్మ మైదాన్ డి మార్ట్ సెంటర్లో ఏఐసిటియు ఆధ్వర్యంలో మహబూబ్ పాషా నాయకత్వన ఆటో కార్మికులు నూతన బోర్డును ఆవిష్కరణ చేశారుఈ కార్యక్రమానికి ఏ ఐ సి టి యు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ ఐ సి టి యు కార్మిక హక్కుల కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వర్తింపజేయాలని తక్షణమే నాలుగు లేబర్ కోడ్స్ ఎత్తివేయాలని మహాలక్ష్మి స్కీం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 4500 రూపాయలు పెన్షన్ సౌకర్యాలని ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా రవాణా కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికాయల రత్నం ఎస్డి బాబా ఎండి ఫర్విజ్ రహమతుల్లా ముస్తఫా హుస్సేన్ నాయక్ ఆఫీల్ చారి బాజీర్ తదితరులు పాల్గొన్నారు