భీమగాని గణేష్ సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్"
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
భీమగాని గణేష్ సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్”
నల్లగొండ జిల్లా,ఫిబ్రవరి05(తెలుగు గళం) న్యూస్:కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ పిలుపునిచ్చారు.
గురువారం తిప్పర్తిలో గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ఎంపీడీవో గారికి మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ఎంఈఓ,తహశీల్దార్ లకు ఇచ్చారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని విభజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం 26,000 నిర్ణయించాలని వేతనాలకు సపరేట్ గ్రాండ్ ఏర్పాటు చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని వారికి కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని అన్నారు కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికులకు కల్పించాలని కార్మిక హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 12 సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో:డివైఎఫ్ఐ తిప్పర్తి మండల కార్యదర్శి పోకల శశిధర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య,పాలడుగు చంద్రయ్య,మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కిన్నెర సైదమ్మ, పోలగోని యాదమ్మ ,రూతమ్మ ,రేణుక, వెంకటమ్మ,సత్తమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.