సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న
అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు.. సంఘటిత, అసంఘటిత కార్మికులకు గొడ్డలి పెట్టు అని సీఐటీయూ రాష్ట్ర యాటల సోమన్న అన్నారు. మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో ఎర్ర మమత, ఎర్ర కనకయ్య ల అధ్యక్షతన సీఐటీయూ 7వ మహాసభలు ఆదివారం జరిగాయి.
ఈ మహాసభకు సోమన్న ముఖ్యతిథిగా హాజరై . మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అమలుచేస్తూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే కార్మికుల పని గంటలను పెంచారని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి కులం, మతంపై రాజకీయాలు తప్ప.. కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టదని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి రానున్న రోజుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రూ.26 వేలు కనీస వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రానున్న పోరాటాల్లో అన్ని రంగాల కార్మికులందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో లో రైతు సంఘం కార్యదర్శి బెల్లకొండ వెంకటేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర ఆనందం లు ప్రసంగించారు.
అనంతరం మండల కన్వీనర్ గా అన్నబోయిన రాజు, కమిటీ సభ్యులుగా ఎర్ర కనుకయ్య, నిలిగొండ కొమురయ్య, మానేపల్లి భిక్షపతి, బుర్రి సుధాకర్, ఎర్ర మమత, కొలుగూరి రాజమణి, గంధమల్ల స్వామి, లక్ష్మణ్, బవండ్లపల్లి పెంటయ్య, గంధమల్ల క్రిష్టయ్య, బైరగొని అంజుం లను నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.