కుణ్య తండా యూత్ కాంగ్రెస్లోకి భారీ చేరికలు
ఎనిమిదో వార్డు అభ్యర్థి ప్రగతి శ్రీపాల్ రెడ్డికి యువత మద్దతు
సుమారు 50 మంది టిఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిక కుణ్య తండా ప్రాంతంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎనిమిదో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డికి మద్దతుగా
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి
కుణ్య తండా యూత్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బానోత్ కుమార్, భాను తిరుపతి, భానోత్ విజయ్, బానోతు సూర్య, బానోతు బాలి, భానోత్ నరేష్, శ్రీనివాస్, స్టాలిన్ శ్రీనివాస్, రమేష్, సిద్ధు, ధమ శివ, విరన్న, గుగులోతు మన్సూర్, భానోత్ మల్సూర్, డాక్టర్ వెంకన్న, గణేష్, పాండు, విరేందర్, రాకేష్, లింభ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువత టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల ఉపేందర్, ప్రజాపతి గంధసిరి బిక్షపతి, పొన్నం వినయ్, ముదిరెడ్డి నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని తెలిపారు. యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
యువత కూడా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.