
కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జనగామ, మార్చి 06: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు.బచ్చన్నపేట మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కిచెన్‌ను సందర్శించి కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. గుడ్లను నీటిలో వేసి వాటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు.పాఠశాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఎస్ఓను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో మాట్లాడి అల్పాహారం గురించి ఆరా తీశారు.మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ గీత తదితరులు పాల్గొన్నారు.