కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన
రేగొండ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్కు నిరసనగా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు.తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ సయ్యద్ ఖలీద్,భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సూచనలతో,ఉమ్మడి రేగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోయిల క్రాంతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగల ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ కార్యాలయాల ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు.తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, రాజకీయ విమర్శల్లో సంయమనం పాటించాలని కేటీఆర్కు యూత్ కాంగ్రెస్ నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రేగొండ మండల ఉపాధ్యక్షులు రాసప్రశాంత్, పున్నం ప్రవీణ్,రేగొండ టౌన్ ఉపాధ్యక్షుడు సామల సురేందర్ రెడ్డి,జగయ్యపేట గ్రామ ఉపాధ్యక్షుడు పేరాల రాజేందర్,రామగుండలపల్లి గ్రామ అధ్యక్షుడు కట్కూరి విష్ణు,లింగాల గ్రామ అధ్యక్షుడు మద్దెల రమేష్, కనిపర్తి గ్రామ అధ్యక్షుడు చిలపాక కర్ణాకర్,జూబ్లీ నగర్ గ్రామ అధ్యక్షుడు సంభరాజు సాయికిరణ్, రంగయ్యపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు బొచ్చు నవీన్,నారాయణపూర్ గ్రామ ప్రధాన కార్యదర్శి గణపాక కోటి,యూత్ నాయకులు మోరే శ్రీను, నవీన్, అరవింద్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు