కొత్తపల్లి గోరి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా గట్టు ప్రదీప్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
గోరి కొత్తపల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా చిన్న కోడెపాక గ్రామానికి చెందిన గట్టు ప్రదీప్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్లు సమావేశమై ఉపసర్పంచ్‌ల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్‌ల మధ్య చర్చల అనంతరం కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా మార్క కమలాకర్,గౌరవ అధ్యక్షునిగా పిండి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శిగా సాంబయ్య,కోశాధికారిగా పొన్నం రాజు,కార్యవర్గ సభ్యులుగా వడ్డాల శ్రీకాంత్, వనపర్తి శ్రీను, వర్దినేని రాజేశ్వరరావులను నియమించారు.ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా గట్టు ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ,తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఉపసర్పంచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ఉపసర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపసర్పంచ్‌ల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా పని చేస్తానని తెలిపారు.ఈ సమావేశంలో పలువురు ఉపసర్పంచ్లు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.