 
                                                      
                                                క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం
హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ రక్తదాన శిబిరంలో 500 మందికి పైగా స్వచ్ఛంద దాతలు పాల్గొనడం విశేషం.రక్తదానం చేసిన యువతను,నిర్వాహకులను ప్రజాప్రతినిధులు అభినందించారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..రక్తదానం అత్యంత పుణ్యకార్యం.మన రక్తం వేరొకరి ప్రాణం నిలబెట్టగలదు.ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆనందదాయకం.నిర్మాణ రంగంలో క్రెడాయి అందిస్తున్న సేవలతో పాటు,సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయం,అని అన్నారు.
 
         
         
         
         
        