క్రైస్తవం అంటే జీవన విధానం నేర్పే మార్గం
క్రైస్తవులు దయా హృదయం కలిగి ప్రేమను పంచాలి
రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తుంది
అన్ని మతాలను గౌరవించుకోవడం మంచి సాప్రదాయం
మత సామరస్యాన్ని కాపాడటానికి,మత విద్వేషాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది
ఎన్ని కష్టాలు పడైనా పిల్లలను బాగా చదివించాలి
ఏ సమస్యను అయినా పరిష్కరించగలిగేది చదువు ఒక్కటే
పిల్లలను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి.
ఆ దిశగా పాస్టర్స్ సందేశాలు ఇవ్వాలి క్రైస్తవం అంటే మతం కంటే ఎక్కువ అని,బ్రతుకు మార్గాన్ని నిర్దేశించిదే క్రిస్టియానిటీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కే.ఆర్ గార్డెన్స్ లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా అధికారులు,పాస్టర్స్ తో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…..గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించాలననే ఆలోచనలతో అన్ని మతాల పండగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగానే క్రిస్మస్ పండుగ సందర్బంగా క్రైస్తవ సోదరులకు విందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే ఇదొక చక్కటి సాంప్రదాయం అని,బతుకమ్మ,క్రిస్మస్,రంజాన్ పండుగ ఈ మూడు పండుగలను కూడా రాష్ట్ర పండుగలుగా గుర్తించి ఆయా మతాలను గౌరవించడం,ప్రభుత్వమే అధికారికంగా పండుగలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని తెలిపారు.ఈ సాంప్రదాయం మతసామరస్యాన్ని కాపాడడానికి,మతాల మధ్యన విద్వేషాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు,దేశాలకే పరిమితం అవుతాయాని కానీ క్రిస్మస్ పండుగ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.క్రైస్తవం అంటే మతం కంటే ఎక్కువ అని అది జీవన విధానాన్ని నేర్పే ఒక మార్గం అని తెలిపారు.ఏసు ప్రేమను పంచండి,శాంతిని నెలకొల్పాలనే సందేశం ఇచ్చారని దాన్ని ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు.ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి,దయా గుణాన్ని కలిగి ఉండాలి,తప్పులు చేసిన వాళ్లను క్షమించే గుణం ఉండాలి,పది మందికి సహాయపడే ఓర్పు,నేర్పు కూడా ఉండాలని సూచించారు.అంతేకాదు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.పాస్టర్స్ ప్రార్థనా మందిరానికి వచ్చే తల్లిదండ్రులతో ఎన్ని కష్టాలున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించే విధంగా సందేశం ఇవ్వాలని తెలిపారు.సమాజంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి విద్య ఒక్కటే మార్గం అని అన్నారు.విద్య ద్వారా మంచి గుర్తింపు,ఉపాధి దొరుకుతుందని తెలిపారు.పిల్లలు,యువకులు మత్తు పదార్థాలకు,మద్యపాననికి దూరంగా ఉండే విధంగా పాస్టర్స్ చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డివో వెంకన్న,నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు,ఎంపీడివోలు,పాస్టర్స్,క్రిస్టియన్ మత పెద్దలు,క్రిస్టియన్ సోదర సోదరిమనులు తదితరులు పాల్గొన్నారు.