
ఈ69న్యూస్ వరంగల్:ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సర్కిల్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డెపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ రాయపురం సాంభయ్య మాట్లాడుతూ–వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచాయని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆ మార్గంలో నడుచుకుంటూ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంటా నరేందర్ రెడ్డి,అంజద్ ఖాన్,కొంరెల్లి యాదవ్,శివకుమార్,జోగి రెడ్డి,నవనీత్,కరుణాకర్,ఇస్హాక్ తదితరులు పాల్గొన్నారు.