ఏకశిల ఈ టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు
తెలుగు గళం న్యూస్.
అయినవోలు
పున్నేలు: స్కూల్ గేమ్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా స్థాయి క్రీడల్లో ఏకశిల ఈ టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న హనుమకొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. కాగా ఖో-ఖో 17 సంవత్సరాల అంతర జిల్లా స్థాయి బాలుర విభాగంలో ప్రథమ స్థానం, 14 సంవత్సరాల బాలురు మరియు బాలికల విభాగంలో కూడా మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. గెలుపొందిన విద్యార్థులు SGF ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను ఐనవోలు MEO పులి ఆనందం, కార్యదర్శి కిరణ్ మెడల్స్ తో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మండల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కైలాష్, కిషన్, సుమలత, సందీప్, నర్సయ్య, రజినీకర్, గణేష్, వినయ్, రమేష్, రాజు, కోచ్ లు పాల్గొన్నారు