గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు పాల్గొన్న దయాకర్ రెడ్డి
గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు… అన్నదానాల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ అలముకుంది. గణనాథుని నామస్మరణతో వీధులు మార్మోగి, మండపాల వద్ద భక్తుల సందోహం ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి నేలకొండపల్లి మండల కేంద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్–1, సాయి ప్రభాత్ నగర్–2, కే బీ ఆర్ నగర్, పెద్ద తండా, సింహాద్రి నగర్, ఆర్ ఎస్ నగర్, సత్యనారాయణపురం, రాజీవ్ గృహకల్ప, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్ ముత్యాలమ్మ గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. మండపాల నిర్వాహకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన దయాకర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గణపతి మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు