గాయపడిన విద్యార్థులను పరామర్శించిన టీఆర్పి అధ్యక్షుడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్ లోని కృష్ణ కాలనీ వైశాలి పాలి,ఆయేషా పాలి,అస్మిత పాలి ఉదయం స్కూలు బస్సు లేట్ కావడంతో స్కూటీ మీద బిట్స్ బాలాజీ స్కూల్ కు వెళుతుండగా స్కూల్ టర్నింగ్ దగ్గర వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో పిల్లలకి ఒకరికి కుడికాలు ఫ్యాక్చర్ కావడం జరిగింది ఇంకొకరికి ముఖం పైన కంటి పైన గాయాల అవడం జరిగింది.ఒక పాప మామూలు గాయాలతో బయటపడింది,వెంటనే అక్కడ ఉన్న వారు హుటాహుటిన గవర్నమెంట్ వంద పడకల హాస్పిటల్ కు తరలించడం జరిగింది.యాక్సిడెంట్ విషయం తెలియగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు జిల్లా నాయకులతో కలిసి ప్రభుత్వ మంద పడకల దావకానకు వెళ్లి పిల్లలను చూసి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది.వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని ఏదైనా బలమైన గాయం తగిలి ఉంటే మెరుగైన చికిత్స కోసం బయటికి పంపించాలని రవి పటేల్ డాక్టర్లతో మాట్లాడడం జరిగింది.