గిరిజన రైతుల దారి మూసిన సత్తి రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
దశాబ్దాలుగా గిరిజన రైతులు నడిచే దారిని మూసివేసిన సత్తిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు, నీలికుర్తి గ్రామ రెవిన్యూ పరిధిలోని భజన తండా
గిరిజన రైతుల దారిని పరిశీలించిన సిపిఐ బృందం, ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన రైతుల వ్యవసాయ భూములకు దశాబ్దాల కాలము నుండి దారి కొనసాగుతుండగా, దీని పై ప్రభుత్వ సొమ్ముతో ఫార్మేషన్ రోడ్డు కూడా వేశారు ఈరోడ్ ను సత్తిరెడ్డి అనే రైతు అక్రమంగా దారికి అడ్డంగా కందకం తవ్వి, ప్రభుత్వ స్థలములో కట్టిన స్మశాన వాటికని కూల్చివేసినా పోలీసులు చోద్యం చూస్తూ ,గిరిజన రైతులు కేసు పెట్టిన పట్టించుకోకుండా, తిరిగి గిరిజన రైతులపైనే పోలీసులు కేసులు బనాయించడం చాలా దారుణమని, వెంటనే సర్వే చేయించి గిరిజన రైతులకు వారి పంట పొలాలకు పోయే విధంగా దారి చూపించాలని, అక్రమంగా దారికి కందకం తవ్వి, స్మశాన వాటికను కూల్చివేసి, గిరిజన మహిళలను అవమానపరిచే విధంగా దూషించిన సత్తిరెడ్డి పై, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలో కొనసాగుతాయని అన్నారు,
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ రషీద్ పోలపాక వెంకన్న, గిరిజన బాధిత రైతులు బిక్కు, వెంకటీ, రవి, శాలి, కమిలి తదితరులు పాల్గొన్నారు