గూడూరు లో రావూరి ఆద్వర్యంలో జలగం 27 వర్ధంతి
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల అతి చిన్న గ్రామం గూడూరు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జలగం వెంగళరావు 27 వ వర్ధంతి శుక్రవారం కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి రావుల పుల్లారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసరచంద్రశేఖర్ రెడ్డి పాల్గొని జలగం వెంగళరావు విగ్రహానికి పూలమాల,పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాసర మాట్లాడుతూ నాడు అడవులతో నిండిపోయి ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు నివాస యోగ్యంగా మార్చిన అభివృద్ధి ప్రదాతగా వెంగళరావు తన పేరును లిఖించుకున్నారని తెలిపారు.ఖమ్మంజిల్లాను దేశ మ్యాప్ లో అగ్రభాగాన చూపించిన మహానేత అని ఆయన అడుగుజాడలలో నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో: మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదె ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, తిరుపతయ్య,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Good coverage medam garu.