గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మూడవ మహాసభలో నూతన కమిటీ ఏర్పాటు ఈ69న్యూస్ హనుమకొండ:గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మూడవ మహాసభ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు.అయినవోలు మండలానికి చెందిన నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ ని జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా చిన్న రాజు యాదవ్ మాట్లాడుతూ..ఈ పదవికి తాను ఎంచుకున్న సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే,సంఘ అభివృద్ధికి తన వంతు సేవలు పూర్తి స్థాయిలో అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.సంఘం ద్వారా గొర్రెల మేకల పెంపకదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.