జనగామ జిల్లాపాలకుర్తి మండలం కొండాపూర్ విలేజ్ మేకల తండాలొ గోశాల లేకుండా అక్రమంగా గోవులను తరలింపు చేస్తున్న వారిని పర్వతగిరి మండలానికి చెందిన గోశాల నిర్వాహకుడు బొబ్బల ప్రతాపరెడ్డి బృందం అడ్డుకున్నారు.వివరాలకెళ్ళుతే..వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలల నుండి నిన్న మధ్యాహ్నం పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామానికి చెందిన కొందరు జగదాంబ గోశాల అనే ఒక అబద్ధపు సర్టిఫికెట్ ను సృష్టించి గోవులను డీసీఎంలో తీసికొని వెళ్తుండగా అక్కడి దేవస్థానంకు చెందిన సిబ్బంది కొందరు పర్వతగిరి లోని గోశాల యాజమాన్యంకు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పర్వతగిరి గోశాల యాజమాన్యం బృందం మండలంలో జగదాంబ గోశాల గురించి ఆరా తీయగా అక్కడ ఎక్కడా గోశాల లేదు అనే విషయం బయటపడింది. దానితో ఆరా తీసుకుంటూ అన్ని చోట్ల తిరిగి చివరికి జఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామం మరియు పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామ సరిహద్దులోగల మేకల తండాలో పట్టుబడ్డారు. ఈ విషయం వెంటనే జఫర్ ఘడ్,పాలకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పాలకుర్తి పోలీసులు రంగ