గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవో లకు శిక్షణ
హనుమకొండ జిల్లాలోని మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి,ఎల్కతుర్తి,కమలాపూర్ మండలాల్లో ప్రొసీడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయా మండలాల్లో నిర్వహించారు.భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లోని రైతు వేదికలో,ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో,కమలాపూర్ మండలంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో హనుమకొండ జిల్లాలోని మూడు మండలాల్లోఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు.ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ సీల్ చేసే విధానం,ఓటింగ్ ప్రారంభానికి ముందు,కౌంటింగ్ పూర్తయ్యాక సీల్ చేసే విధానం,కౌంటింగ్ సమయంలో వ్యాలీడ్,ఇన్ వ్యాలీడ్ ఓట్లను ఎలా గుర్తించాలనే అనే అంశాలపై మాస్టర్ ట్రైనర్లు ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలతో రూపొందించిన కరదీపికను ప్రిసైడింగ్ అధికారులకు అందజేశారు.ఆయా మండలాలల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రిసైడింగ్ అధికారులకు అదే మండలంలోని గ్రామపంచాయతీలకు పదో తేదీన కేటాయించబడతారని,అదేరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఎన్నికల సామగ్రితో సంబంధిత గ్రామపంచాయతీలకు వెళ్తారని శిక్షణ కార్యక్రమంలో తెలియజేశారు.11వ తేదీన ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమయ్యే కౌంటింగ్ నిర్వహణ,సర్పంచ్,వార్డు సభ్యులు,ఉప సర్పంచ్ ఫలితాలు,రిసెప్షన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి అందజేసే వరకూ విధులు,బాధ్యతలను ప్రిసైడింగ్ అధికారులకు తెలియజేశారు.ఈ సందర్భంగా భీమదేవరపల్లి,ఎల్కతుర్తి,కమలాపూర్ ఎంపీడీవోలు వీరేశం,విజయ్ కుమార్,బాబు,మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,రామన్న,పృద్వి,శివకోటి,శ్రీధర్ రెడ్డి,రాజేశ్వరరావు,నవీన్,బ్రహ్మచారి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.