గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని నందనం గ్రామంలో ఎమ్. జి.ఎన్. ఆర్. ఇ. జి.ఎస్.20లక్షల రూపాయల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యేకేఆర్ నాగరాజు ప్రారంభించారు.ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు..
అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.
అదేవిధంగా గ్రామపంచాయతీ భవనానికి స్థలం బహుకరించిన వారిని ఎమ్మెల్యే నాగరాజు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామా పంచాయతీ భవాన ప్రహరీ గోడ తదితర వాటికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తా అలాగే గ్రామంలో బడి, గుడి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. మీ అందరికీ తెలుసు వర్ధన్నపేటలో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ అంటే ప్రపంచంతో తలబడేంత ఇంటర్నేషనల్ అంగులతో త్వరలోనే పాఠశాల నిర్మాణం కాబోతుందన్నారు..త్వరలోనే మనకు మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవ్వబోతున్నాయి ఇక్కడి నుంచి దేశ విదేశాలకు విమాన సర్వీసులు నడువనున్నది చుట్టుపక్కల ఉన్న మన స్థలం రేట్లు ఒక మూడు ఇంతలా నాలుగింతలు పెరిగిపోతుంది అన్ని ఇంటర్నేషనల్ కాబట్టి మన భూములను కాపాడుకోండి మీరు పరిరక్షించుకోండి తప్పనిసరిగా వాటి రేట్లు అంతకంటే కన్నతల్లి కంటే కన్న కొడుకు కంటే కూడా ఎక్కువ సంపాదించి పెడితే కాబట్టి భూమిలో ఉన్న మన సోదరులు రైతు సోదరులు జాగ్రత్తగా చూసుకోండి సమస్యలను కూడా అతి త్వరలోనే రైతులకు దగ్గరుండి చేపించే బాధ్యత కూడా తీసుకుంటాడు. కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలని సదు దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీటవేస్తూ వడ్డీలేని రుణాలు, సోలార్ పవర్, క్యాంటీన్, ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేస్తూ అరేయ్ మీ ఊరికి కూడా ఒక బస్సు ట్రిక్ వచ్చే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాన్నారు…నందనం నుంచి జగ్గయ్య గూడెం వరకు ఒక కోటి లక్షల రూపాయలు నిధులతో రోడ్డు మంజూరు అయిందన్నారు స్మశాన వాటికి కూడా నిధులు మంజూరు చేసామన్నారు. గత ప్రభుత్వం అప్పులకు తెలంగాణను వచ్చినా కూడా ఒక్కొక్కటిగా ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి ఏర్పాటు చేస్తే ముందుకు వెళితే నా వంతు సహాయ సహకారాలు అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నాను అన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గ్రామంలో ఇటీవల ఎంబిబిఎస్ సీట్లు సంపాదించిన విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జెట్టబోయిన రాజు, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్ గౌడ్, సర్పంచ్ లు శంకర్ రెడ్డి, స్వాతి, దేవికరెడ్డి, తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.