గ్రామాభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేస్తాం:మందపాటి
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల మర్లపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేస్తానని గ్రామ ఉపసర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలబ్రేషన్ పంక్షన్ హాలులో జరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సత్కార వేడుకలో రాఘవరెడ్డి కు,గ్రామ సర్పంచ్ కనమాల ఆంధ్రయ్య లకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాలువాలు కప్పి,మెమంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాఘవరెడ్డి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో:భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,నడిపల్లి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.