గ్రామ అభివృద్ధే నా లక్ష్యం-సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గిన్నారపు లత రామస్వామి మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరితో సమన్వయం చేసుకుంటూ,ఐక్యతతో ముందుకు సాగితేనే గ్రామం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.గ్రామంలో ఉన్న మౌలిక వసతుల సమస్యలు,రోడ్లు,డ్రైనేజీ,తాగునీరు,వీధి లైట్లు,పారిశుధ్యం వంటి అంశాలను దశలవారీగా గుర్తించి,ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు,స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యల సహకారంతో అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తానని ఆమె తెలిపారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు పూర్తి సహకారం అందిస్తూ,గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో గిన్నారపు లత రామస్వామికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.గ్రామ అభివృద్ధిపై ఆమె వ్యక్తపరిచిన సంకల్పం,సేవాభావాన్ని గుర్తించి యువత శాలువాతో సత్కరించారు.యువత తరఫున పలువురు మాట్లాడుతూ..గ్రామ భవిష్యత్తుకు స్పష్టమైన దృష్టి ఉన్న నాయకురాలిగా ఆమెను ఆదరిస్తున్నామని తెలిపారు.సన్మాన కార్యక్రమంలో గిన్నారపు లత రామస్వామి మాట్లాడుతూ..యువత సహకారం లేకుండా గ్రామ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు,యువత,మహిళలు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి తనకు సహకరించాలని,మలక్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని ఆమె విజ్ఞప్తి చేశారు.