గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు ప్రత్యేక శిక్షణ
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న రిటర్నింగ్ అధికారి–2 (స్టేజ్–II) అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.పింకేష్ కుమార్,ఐఏఎస్ తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా,పారదర్శకంగా నిర్వహించాలంటే అధికారులు ముందుగానే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకొని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.ఎన్నికల విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలు,సమస్యలు తలెత్తిన వెంటనే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.అదేవిధంగా,ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు.ఫేజ్–1 లోని చిల్పూర్,ఘన్పూర్ స్టేషన్,జాఫర్‌గఢ్,లింగాలఘన్పూర్,రఘునాథపల్లి మండలాలకు చెందిన ఎన్నికల విధుల అధికారులు సంబంధిత మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.తేదీ&సమయం:-09-12-2025-ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు.
ఫెసిలిటేషన్ కేంద్రాల వివరాలు:
చిల్పూర్-ఎంపిడిఓ కార్యాలయం,చిల్పూర్
ఘన్పూర్ స్టేషన్-రైతు వేదిక, ఘన్పూర్ స్టేషన్
జాఫర్‌గఢ్-టిఎస్ మోడల్ స్కూల్,జాఫర్‌గఢ్ (రేగడి తండా సమీపంలో)
లింగాలఘన్పూర్-ఎంపిడిఓ కార్యాలయం,లింగాలఘన్పూర్
రఘునాథపల్లి-ఎంపిడిఓ కార్యాలయం,రఘునాథపల్లి
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ **ఎలెక్షన్ డ్యూటీ ఆర్డర్,ఓటర్ ఐడీ కార్డు, ఫారం–14 (పోస్టల్ బ్యాలెట్ వినతి పత్రం)తో సంబంధిత కేంద్రాలకు హాజరవ్వాలని అదనపు కలెక్టర్ తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ పొందిన వెంటనే అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించి,సక్రమంగా సంతకం చేసిన డిక్లరేషన్‌తో పాటు బ్యాలెట్‌ను అదే రోజు అక్కడే సమర్పించాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో
జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి శ్రీమతి మాధురి షా,డిఎల్పిఓ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్లుగా మెరుగు రామరాజు,సురేందర్ రెడ్డి,నరసింహా మూర్తి పాల్గొని అధికారులకు శిక్షణ అందించారు.