ఘనంగా ఆండాళ్ అమ్మవారి పూజలు
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ స్వామి వారి దేవాలయంలో గత 26 రోజులుగా ఆండాళ్ అమ్మవారి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని,పూజారి కలకోట రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఆండాళ్ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక వ్రతాలు,అర్చనలు నిర్వహించి అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేస్తున్నారు.ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు,సులోచన,కొలిపాక సతీష్,సునీత,యద శ్రీనివాస్,తెల్లాకుల రామకృష్ణ,సుష్మ,గట్టు మంజుల,స్వప్న,స్వరూప పద్మ,గీత,చంద్రకళ,నిర్మల,హేమలత,జ్యోతి,యాదమ్మ,కోమలా,రేణుక,ఉమ,నీలమ్మ తదితరులు పాల్గొని ఆండాళ్ అమ్మవారి ఆశీస్సులు పొందారు.