ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి,ఉద్యమ పితామహుల సేవలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం, సమాన హక్కులు,ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ అధ్యక్షుడు వక్కల అక్షిత్ మాదిగ అధ్యక్షత వహించారు. అధికార ప్రతినిధి చిట్యాల కృపానందం మాదిగ, ఉపాధ్యక్షులు వక్కల రుసన్ మాదిగ, కొలిపాక కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శి రాజారపు ప్రశాంత్,కమిటీ సభ్యులు, గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని, ఉద్యమ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరవేసి యువతను చైతన్యవంతం చేస్తామని తెలిపారు.గ్రామ స్థాయిలో సంఘటితంగా పనిచేస్తూ ఉద్యమ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొని, ఉద్యమ విజయాలకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.