ఘనంగా చిన్నారి ఆకాంక్ష పుట్టిన రోజు వేడుకలు E69NEWS: హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండెబోయిన నరసింహ గౌడ్ గారి కుమార్తె ఆకాంక్ష 1వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు గాదె అనిల్ కుమార్, గడ్డం మురళి, ఎండి రహీం ఖాన్, బరిగెల కుమార్, కాత మధుకర్ తదితరులు హాజరై చిన్నారి ఆకాంక్షకు ఆశీర్వచనాలు అందించి, కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.