ఘనంగా ముస్లిహ్ మౌఊద్ దినోత్సవం సమావేశం
వరంగల్ పట్టణ కేంద్రంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ముస్లిహ్ మౌఊద్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి స్థానిక కమ్యూనిటీ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం అధ్యక్షత వహించారు.కార్యక్రమం ఖురాన్ తిలావత్తో ప్రారంభమైంది.ముహమ్మద్ హమీద్ అహ్మద్ ఖురాన్లోని పలు సూక్తులను భావప్రధంగా పఠించారు. అనంతరం సయ్యద్ ముబారక్ అహ్మద్ ఉర్దూ పద్యాన్ని మధురమైన స్వరంతో చదివి సభికులను ఆకట్టుకున్నారు.తదుపరి స్థానిక మిషనరీ ఇంచార్జీ మౌల్వీ ముహమ్మద్ అయాన్ పాషా ముస్లిహ్ మౌఊద్ దినోత్సవ ప్రాముఖ్యత, ప్రత్యేకతపై వివరంగా మాట్లాడారు. 1886 ఫిబ్రవరి 20న మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ (అలైహిస్సలాం)కి అల్లాహ్ తఆలా ప్రసాదించిన మహా ప్రవచనం నెరవేర్చబడిన సందర్భాన్ని ఆయన వివరించారు. ఆ ప్రవచనానికి ప్రతిరూపంగా నిలిచిన మిర్జా బషీరుద్దీన్ మహ్మూద్ అహ్మద్ (రజి.) సేవలను ఆయన ప్రస్తావించారు.అనంతరం జిల్లా యువజన సమితి అధ్యక్షుడు ముహమ్మద్ కబీర్ పాషా మాట్లాడుతూ, జమాత్ అహ్మదీయ్య స్థాపన ఉద్దేశం మరియు ముస్లిహ్ మౌఊద్ దినోత్సవ ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మౌల్వీ సయ్యద్ కరీం ముస్లిహ్ మౌఊద్ ఇస్లాం ప్రచారం, జమాత్ విస్తరణలో చేసిన విశిష్ట సేవలను వివరించారు.సభా అధ్యక్షుడు ముహమ్మద్ సలీం తన అధ్యక్ష ప్రసంగంలో ముస్లిహ్ మౌఊద్ దేశానికి, సమాజానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ, యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.చివరిగా ప్రత్యేక ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మౌల్వీ ఉసామా ,అమ్జద్,హంజ,నజీమా రఫీ,రుబీనా కబీర్,మునీషా కరీం,గౌషియా అయాన్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు