ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఈ రోజు అయినవోలు మండలంలో కస్తూర్బా బాలిక విద్యాలయం, ప్రభుత్వ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలల్లో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సంఘ సంస్కర్త, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా,ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ బోల్లపెల్లి మధు ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ భరిగల భాస్కర్ మధు సమక్షంలో నిర్వహించగా, విద్యారంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసి స్వీట్లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకుంటూ, మహిళా విద్యే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ మునిగాల సమ్మయ్య, అయినవోలు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులు, వార్డ్ మెంబర్స్, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఘనంగా విజయవంతం చేశారు.