ఘనపూర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో డి.యస్.వెంకన్న ఈ69న్యూస్ జనగామ: స్టేషన్ ఘనపూర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న గురువారం సందర్శించారు.తన పర్యటనలో డ్యూటీ డాక్టర్,ఇతర ఆరోగ్య సిబ్బందిని కలిసి ప్రస్తుత సేవల పరిస్థితి,సౌకర్యాలు,సిబ్బంది సమగ్రత,వైద్య పరికరాల అందుబాటును సమీక్షించారు.ఆరోగ్య కేంద్రానికి రోజూ వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని విభాగాల్లో సమన్వయం ఉండాలంటూ సూచించారు.సిబ్బంది సమయపాలన,డ్యూటీ గమనికలు,ఔషధాల నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ సందర్బంగా కేంద్రంలోని మూల సౌకర్యాలు,శుభ్రత,అత్యవసర సేవల ప్రాప్యతపై ఆర్డీవో విపులంగా సమీక్షించారు.ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ,ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు.