
చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికం
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు అధికారం పోయే కాలం వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన వికృతత్వాన్ని పైశాచికత్వాన్ని చంద్రబాబునాయుడు ని అరెస్టు చేయడం ద్వారా నిరూపించుకున్నారని టీడీపీ మండల అధ్యక్షులు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ప్రజాసేవకు అంకితమై తెరిచిన పుస్తకం లాంటి నారా చంద్రబాబు నాయుడు కి అవినీతి మరక అంటించాలనే జగన్మోహన్ రెడ్డి వికృత కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవెరదని ఆ ప్రయత్నం దింపుడు కళ్ళం లాంటి ఆశేనని దీనిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, జగన్మోహన్ రెడ్డి యొక్క పిల్ల చేష్టలకి శాడిస్ట్ పనులకి రానున్న ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కి కారణాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేయడం ఇక్కడ వ్యవస్థలు ఎంతగా దిగజారాయో విఫలమవుతున్నాయో చంద్రబాబు అరెస్టు ద్వారా బహిర్గతమవుతున్నది. వ్యవస్థలు రాజకీయ పార్టీల నాయకుల ఆకాంక్షల మేరకు పని చేస్తే సమాజం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయం తెలియని జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైన రాజకీయాలకు అధికారాన్ని వాడుకోవడం అనే ఒక సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తెరలేపాడు. ఇది ఏమాత్రం రాజకీయాలకి తగినది కాదు. దీనికి తగిన ప్రతిఫలం వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటమి ద్వారా జగన్మోహన్ రెడ్డి రుచిచూడబోతున్నారని ఆయన హెచ్చరించారు.