చర్చి శంకుస్థాపన, దైనందిని ఆవిష్కరణ
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వరి గాస్పర్ చర్చ్ భవన నిర్మాణ పనులకు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్)శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని మతాలు సమాజానికి శాంతి, ఐక్యత, సేవా భావాన్ని బోధిస్తాయని అన్నారు.ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా చర్చి నిర్మాణం జరగడం ఆనందకరమని పేర్కొన్నారు.మత సామరస్యాన్ని కాపాడటం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అనంతరం కారల్ మార్క్స్ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో నూతనంగా ముద్రించిన దైనందినిని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సాయిబాబా బోధనలు శాంతి,సేవా భావం,మానవత్వాన్ని సమాజానికి అందిస్తాయని అన్నారు.దైనందిని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.భక్తి, నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.తదుపరి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వీ ఆర్ ఫ్యామిలీ మార్ట్ (పీపుల్స్ స్టోర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దుకాణాన్ని ప్రారంభించారు.యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.అలాగే భూపాలల్లి క్రిష్ణకాలనీలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి అవసరమని తెలిపారు.చిన్న వయసులోనే క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక వసతులపై ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రభుత్వ అధికారులు జిల్లా కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.