చల్లా ధర్మారెడ్డిని కలిసిన డిప్యూటీ కలెక్టర్
గ్రూపు 1 లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ మర్యాద పూర్వకంగా పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు వారిని సత్కరించి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.వారికి వచ్చిన డిప్యూటి కలెక్టర్ పదవితో సాధ్యమైనంత ప్రజలకు సేవలు అందించి నియోజకవర్గానికి,గ్రామాని కి మంచి పేరు తీసుకురావాలని శుభాశీస్సులు అందించారు.