చిన్న పాపను తప్పించబోయి బైక్ స్కిడ్
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో మంగళవారం అన్నపురెడ్డిపల్లి రోడ్ లో బైక్ యాక్సిడెంట్ జరిగింది. ద్విచక్ర వాహనదారుడు అక్క మరియు భార్య తో పాటు కిష్టారం నుంచి చెరుకుపల్లి గ్రామం వెళుతుండగా అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చిన చిన్న పాపను తప్పించబోయి కింద పడిపోయారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది (ఈఏంటి) ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ,
పైలట్ ఏకాంత్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
యాక్సిడెంట్ లో ద్విచక్ర వాహనదారుడు అక్క కూరం. భద్రమ్మ 50 సంవత్సరాలు. తీవ్ర గాయాలు పాలైంది, ఎడమ కాలు మడమే, పాదం పూర్తిగా విరిగిపోయింది. పరీక్షించిన సత్తుపల్లి 108 సిబ్బంది, గాయాలకు కట్లు కట్టి, ఇంజక్షన్స్ అందిస్తూ, సెలెన్ బాటిల్స్ పెడుతూ, ఆక్సిజన్ పెడుతూ, C కాలర్( మెడ పట్టి ), పెడుతూ ధైర్యం చెబుతూ, అంబులెన్స్ లోనే మెరుగైన వైద్యం అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.సకాలంలో స్పందించిన సత్తుపల్లి 108 సిబ్బందిని, కిష్టారం, చెరుకుపల్లి వాహనదారులు, ఖమ్మంజిల్లా 108 మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్ మూడు జిల్లాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్.నజీరుద్దీన్ అభినందించారు.