చిల్పూర్లో రైతు సంఘం కరపత్రాల ఆవిష్కరణ,జూన్ 11న ధర్నాలకు పిలుపు
Uncategorized
E69న్యూస్ జనగామ/చిల్పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు గద్ద కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య మాట్లాడుతూ..రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 11న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టబోయే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాపర్తి సోమయ్య మాట్లాడుతూ..రైతులు రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం 18% పంట రుణాలు,22% దీర్ఘకాలిక రుణాలు పొందాలని,అయితే ప్రతి సంవత్సరం బ్యాంకుల కమిటీలు ఇచ్చే హామీలు ఆచరణలో పెట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని తెలిపారు.వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న వేళ,రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం వల్ల అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతు వ్యతిరేక చట్టాలు రద్దు,రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి,రైతులకు గిట్టుబాటు ధరలు,రుణాల మాఫీ,కిసాన్ సమ్మాన్ నిధి పెంపు,ఎరువులు-విత్తనాలపై సబ్సిడీలు వంటి డిమాండ్లు ఈ సందర్భంగా వెల్లడించారు.కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో నారబోయిన బిక్షపతి,మేసాదం రామరాజు,జక్కుల యాదగిరి,కంచాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.జూన్ 5,6న బ్యాంకుల ఎదుట,జూన్ 11న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని,ఈ ఉద్యమాలను విజయవంతం చేయాలని రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు.