చిల్లంచెర్ల లో నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో మహిళా కోలాటాలతో ర్యాలీగా వచ్చి బిజెపి పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గాదె ఉషాలత రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు.బిజెపి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ముఖ్యఅతిథిగా పాల్గొని బిజెపి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ బిజెపి పార్టీ సర్పంచ్ అభ్యర్థి గాదె ఉషాలత రాంబాబు ను గ్రామస్తులు,మహిళలందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని,దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తున్నారన్నారు.కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు.రైతులకు ప్రతి ఏటా పీఎం కిసాన్ ద్వారా డబ్బులను పెట్టుబడి కోసం అందజేస్తున్నారన్నారు.సర్పంచ్ గా గెలిపించిన తర్వాత చిల్లంచర్ల గ్రామం కోసం రెండు వాటర్ ట్యాంకులు,సైడ్ డ్రైనేజీ కాలువలు,ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం అంబులెన్స్, చిల్లంచర్ల చెరువును మినీ ట్యాంక్ బండ్, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఉషాలత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంబాబు,భాస్కర్, గంగాధర జనార్ధన్, తప్పట్ల రాములు, సాయికుమార్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు