చీఫ్ మినిస్టర్స్ కప్ సందర్భంగా టార్చ్ ర్యాలీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం పలిమెల మండలంలో టార్చ్ ర్యాలీ (అవగాహన కార్యక్రమం)నిర్వహించారు.పలిమెల మండల చౌరస్తా నుంచి గ్రామపంచాయతీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జవ్వాజి పుష్పలత టార్చ్ స్వీకరించి గ్రామపంచాయతీ వరకు ర్యాలీగా పాల్గొన్నారు.అనంతరం మండల పరిధిలో నిర్వహించనున్న గ్రామస్థాయి,క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా క్రీడల్లో యువత విస్తృతంగా పాల్గొనాలని,ప్రభుత్వానికి క్రీడాకారుల ప్రోత్సాహమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయి పవన్,డివైఎస్ఓ,మండల విద్యాధికారి తిరుపతి,మండల పంచాయతీ అధికారి ప్రకాశ్ రెడ్డి,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు,పంచాయతీ కార్యదర్శులు,ప్రభుత్వ ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థులు,అలాగే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పాల్గొన్నారు.క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,నాయకత్వ గుణాలు పెంపొందుతాయని వక్తలు పేర్కొన్నారు.ఈ టార్చ్ ర్యాలీతో చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలపై మండలవ్యాప్తంగా అవగాహన పెరిగిందని తెలిపారు