చెత్తను రోడ్లపై వేస్తె కఠిన చర్యలు
పురపాలక సంఘం పరకాల ప్రాంత ప్రజలకు కమిషనర్ కే.సుష్మ పత్రిక ప్రకటన విడుదల చేశారు.పట్టణంలో వివిధ ప్రదేశలైన కోర్టు వద్ద డిపో వద్ద,హుజురాబాద్ మెయిన్ రోడ్డు,హన్మకొండ మెయిన్ రోడ్డు,భూపాలపల్లి మెయిన్ రోడ్డు,కూరగాయల మార్కెట్ రోడ్డు, మాయాబజార్,ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు,వెల్లంపల్లి రోడ్డు,జయ థియేటర్ రోడ్డు, పాత కోర్టు ఏరియా, హుజురాబాద్ మెయిన్ రోడ్డు,పెద్ద మోరి వద్ద, ఖబ్రస్తాన్ గోడ వెంబడి బీసీ కాలనీ సి ఎం ఎస్ గోదాం గోడ వద్ద సంతోష్ హాస్పిటల్ వద్ద,ఎంఆర్ఎఫ్ టైర్స్ షాప్ మెయిన్ రోడ్డు వద్ద పోచమ్మ గుడి భూపాలపల్లి రోడ్డు వద్ద బొడ్రాయి వద్ద సి ఎస్ ఐ వాటర్ ట్యాంక్ వద్ద సి ఎస్ ఐ సేయింట్ తామస్ స్కూల్ వద్ద ఒంటేరు వాడ గద్దె వద్ద హుజురాబాద్ రోడ్డు బిట్ స్కూల్ ఎదురుగా బురుజు వద్ద పద్మశాలి భవన్ మూల వద్ద ఈ ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగిందని పరకాల కమిషనర్ సుష్మ ప్రకటించడం జరిగింది. అలాగే పురపాలిక పరిధిలో అన్ని వీధులలో నిత్యం చెత్త సేకరణకై స్వచ్చ ఆటోలను ఏర్పాటు చేసి ఇంటింటి చెత్త సేకరణ మరియు వ్యాపార సముదాయాలలో ఉత్పన్నమయ్యే చెత్తను సేకరించడం జరుగుతున్నదని అన్నారు. కానీ పైన ప్రకటించిన కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంతో రోడ్లపై చెత్తను వేయడం జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు తెలియజేసిన కూడా వారిలో ఎలాంటి మార్పు రావడంలేదని గుర్తించడం జరిగిందని కమిషనర్ అన్నారు.ఇలాంటి వ్యక్తుల వల్ల పురపాలిక ప్రాంతములో నిత్యం సమస్యలు ఎదురై చాలా ఫిర్యాదులు అందుతున్నందున వీరిని గుర్తించి మున్సిపల్ చట్టం ప్రకారం పెద్ద ఎత్తున జరిమానాలతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని కమిషనర్ కే.సుష్మ ప్రకటించారు. కావున పురపాలిక ప్రాంతాన్ని పరిశుభ్రముగా ఉంచుట ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పరకాలగా తీర్చిదిద్దుటకు తోడ్పడగలరని కమిషనర్ తెలియజేశారు.