
ఈ69న్యూస్:-జనగామ పట్టణంలోని రంగప్ప చెరువు,గార్లకుంట,బండకుంట,కొత్తకుంట,బతుకమ్మ కుంటల శిఖాల భూములను పరిరక్షించేందుకు ఎఫ్.టి.ఎల్.బఫర్ జోన్ హద్దులు నిర్ణయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ వెంచర్ల వల్ల చెరువుల విస్తీర్ణం తగ్గిందని,ప్లాట్ల రాళ్లను తొలగించాలని కోరారు.రంగప్ప చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలని సూచించారు.